Jul 27,2023 00:15

ప్రజాశక్తి-యంత్రాంగం
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో జిల్లాలో లంక గ్రామాల్లు తల్లడిల్లుతున్నాయి. ఇప్పటికే కొద్ది రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు, తగ్గినట్టే తగ్గి.. మళ్లీ గోదావరిలో వరద పెరగడంతో లంక వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. పలు చోట్ల లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. పొలాలు నీటమునిగాయి.
మామిడికుదురు వరద తగ్గుతూ..పెరుగుతూ ఉండటంతో లంక గ్రామాల ప్రజలు అందోళన చెందు తున్నారు. భద్రాచలం వద్ద క్రమేపీ వరద పెరుగుతుండటంతో జిల్లాలో నదీ తీర గ్రామాల వాసులు కలవర పడుతున్నారు. కనకాయలంక కాజవే నీటమునడంతో పడవలపై రాకపోకలు సాగిసున్నారు. జి.పెదపూడి లంక నదీ పాయ లో వరద నీరు ప్రవహిస్తుంండటం ో నాలుగు లంక గ్రామాల ప్రజలు నాలుగు రోజుల నుంచి పడవల పెరు రాకపోకలు కొనసాగిస్సున్నారు. పాశర్లపూడి, అప్పనపల్లి రోడ్డు మార్గం లో పాటురేవు లో వరదనీరు చేరింది. పశుగ్రాసం వరదనీట మునగటం తో వారం రోజుల నుంచి పశువులకు మేత లేక రైతులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. అయినవిల్లి భారీ వర్షాలకు అయినవిల్లి మండలంలోని సిరిపల్లి, నేదునూరు పలు గ్రామాల్లోని పంటపొలలు నీట మునిగాయి. నీటి మునిగిన పంట పొలాల నుండి మురుగు నీరును దిగువకు దింపేందుకు అక్రమ ఆక్వా చెరువులతో ప్రధాన డ్రెయిన్లు పూడుకుపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు నిలిచిపోయి పంట పొలాలు చెరువులను తలపిస్తూ వరి నాట్లు నీటిలోనే మునిగి తేలాడుతున్నాయి. రామచంద్రపురం భారీ వర్షాలకు గోదావరిలో వరద నీటి ఉధతి కొనసాగుతోంది. ముందు జాగ్రత్త సరిగా కోటిపల్లి ముక్తేశ్వరం రేవులో పడవ ప్రయాణాలు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు భారీ వర్షాలతో రేవులో షాపులన్నీ మూతపడ్డాయి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బుధవారం ఉదయం కె.గంగవరం తహశీల్దార్‌ వైద్యనాథ శర్మ, పంచాయతీ అధికారులతో కలిసి కోటిపల్లి రేవులో పరిస్థితిని సమీక్షించారు. గోదావరి ఉధతి తగ్గే వరకు ప్రయాణాలు నిలిపివేయాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, విఆర్‌ఒలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. ఇప్పటికే లంకల్లోని పల్లపు ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగి ఉన్నాయి.రామచంద్రపురం భారీ వర్షాలకు తోడు వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన గోదావరి నదికి వస్తున్న వరదనీరుతో గోదావరి పరివాహక ప్రాంతంలోని బలహీన ఏటుగట్ల వద్ద అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కె.గంగవరం మండలంలోని కోళ్ల సుందరపల్లి వద్ద ఏటిగట్టును కె.గంగవరం తహశీల్దార్‌ బుధవారం పరిశీలించారు సుందరపల్లి వద్ద బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా ఇసుక మూటలు వేసి ఏటిగట్టుకు రక్షణ కల్పించారు. ఇప్పటికే భద్రాచలంలో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమై గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గురువారానికి వరదనీటి ప్రభావం మరింత పెరిగితే లంక భూములు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశం ఉంది. కపిలేశ్వరపురం మండలంలోని కోరిమిల్లి లో గోదావరి వరద ఉధృతిని బుధవారం తహశీల్దార్‌ కె. సూర్యారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరదల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట డిటి వెంకటేశ్వరరావు, విఆర్‌ఒలు సిబ్బంది, పాల్గొన్నారు ఆత్రేయపురం మండలంలోని గ్రామాలలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లొల్ల గ్రామంలోని పంచాయతీ చెంతనే ఉన్న పెంకుటిల్లు కూలిపోయింది. ఈ సమయంలో ఇంటి యజమాని బండి ఆంజనేయులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే వద్దిపర్రు గ్రామంలో జుజ్జవరపు సూర్యకాంతం ఇంట్లో ఉండగా ఇంటి పైకప్పు ఆమెపై కూలిపోవడంతో ఆమె భుజానికి బలమైన గాయం అయింది. మండలంలోని గ్రామాలలో పల్లపు ప్రాంతాలని జలమయ్యాయి.