ప్రజాశక్తి-అమలాపురం, ఉప్పలగుప్తం
టిటిడి సభ్యులు జిల్లా వైసిపి అధ్యక్షులు, ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌కు అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ, నాయకులు జూన్నురి బాబీ, అంబికా శ్రీను, అడపా శ్రీను తదితరులు ఆదివారం ఆయన స్వగహంలో కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అమలాపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులైన పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి వెంకటేశ్వరస్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు సతీష్ కుమార్ ను కలిసినవారిలో పట్టణ వైసిపి యువత అధ్యక్షులు దూడలఫణి, ట్రస్ట్ బోర్డు సభ్యులు నడింపల్లి వర్మ, సంసాని అబ్బు, కుసుమ శ్రీను, ముంగర ప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఎంఎల్‌ఎ పొన్నాడకు జెడ్‌పిటిసి సభ్యుని వినతి
ఉప్పలగుప్తం ముమ్మిడివరం ఎమ్‌ఎల్‌ఎ,వైసిపి జిల్లా అధ్యక్షులు పొన్నాడ సతీష్ కుమార్ ను ఆదివారం జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు మర్యాదపూర్వకంగా కలిశారు.పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనకు రానున్న సాధారణ ఎన్నికల్లో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేయవలసిందిగా పొన్నాడను సంపదరావు కోరి బయోడేటాను అందజేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని ఈ సందర్భంగా సంపదరావు తెలిపారు.










