Jul 02,2023 23:52

ప్రజాశక్తి-నిడదవోలు
తిరుమలాయపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి, ప్రశ్నించిన దళితులపై దాడి చేసిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా దళిత గిరిజన సంఘాల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం తిరుమలాయపాలెం దళితులు చేస్తున్న ఆత్మ గౌరవపోరాటానికి సంఘీభావంగా నిడదవోలు పట్టణంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు చెట్టే రామకృష్ణ. ప్రగతిశీల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు మత్తి అర్జునుడు, బిఎస్‌పి నాయకులు డాక్టర్‌ నక్కా వెంకటేశ్వరరావు, కెఎన్‌పిఎస్‌ నాయకులు గెడ్డం రవీంద్ర బాబు తది తరులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. రాంబాబు మాట్లాడుతూ తిరుమలాయపాలెం గ్రామంలో రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం గ్రామ అగ్రకుల పెత్తం దారులకు అనుకూలంగా అత్యుత్సాహం. చూపటం వల్లే ప్రతిష్టించిన అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపుపై చర్చలు ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్నా, దళితులపై పెత్తందారులు పోలీసులు దాడి చేశారని మహిళలకు కాళ్లు చేతులు విరిగాయన్నారు. హాస్పటల్‌ లో వున్నా దళితుల పై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు వాదన ప్రకారం దళితులు పోలీస్‌ సిబ్బందిపై దాడి చేస్తే పోలీసులకు కూడా గాయాలు అవ్వాలి కదా అని రాంబాబు ప్రశ్నించారు. అధికారులు కంటితుడుపు చర్యలు తప్ప సమగ్ర విచారణ జరపకుండా తాత్సర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఘటనతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నవారికి దళిత గిరిజన సంఘాల జెఎసి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల తీసుకెళుతున్న నాయకులను అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారన్నారు. అయితే రాత్రి వరకు రాజమహేంద్రవరం 3టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో దళిత నాయకులు అజ్జరపు వాసు, జువ్వల రాంబాబు, భాను చందర్‌, ఐ రాంబాబు, రాజాలను నిర్బంధించారన్నారు. ప్రజల ఆందోళనతో విడిచి పెట్టారన్నారు. దళితుల పై దాడి చేసిన వారిపై ఇంత వరకు కేసులు నమోదు చేయలేదని రాంబాబు వివరించారు. అంబేద్కర్‌ విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం స్పందించి వెంటనే విగ్రహం ప్రతిష్టించే చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో టి.నాని, లెనిన్‌, అశోక్‌, పల్లి శేఖర్‌, ప్రభాకర్‌, అనిల్‌ శ్యామ్‌, వినోద్‌ నందు తది తరులు పాల్గొన్నారు.
దళిత గిరిజన సంఘాల మద్దతు
చాగల్లు తూర్పు గోదావరి జిల్లా దళిత గిరిజన సంఘాల జెఎసి ఆధ్వర్యంలో దారవరం దళితులు తిరుమలాయపాలెం దళితులకు న్యాయం జరిగే వరకూ అండగా వుంటామన్నారు. ఆదివారం దారవరంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో జెఎసి నాయకులు జువ్వల రాంబాబు పాల్గొని మాట్లాడారు. తిరుమలాయపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తక్షణమే ప్రతిష్టించాలని. సాంఘిక బహిష్కరణకు పిలుపునిచ్చిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హోమ్‌ మంత్రి తానేటి వనిత జోక్యం చేసుకొని గ్రామంలో పర్యటించి దళితులకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో గుమ్మాపు జాన్‌, మరపట్ల యేసు, మద్దాల నరేంద్ర, ఉబా బన్నీ, సరిపల్లి దానయ్య, గంటి ధర్మయ్య తది తరులు పాల్గొన్నారు