Jul 07,2023 23:21

ప్రజాశక్తి-అయినవిల్లి
టిడిపి ఆధ్వర్య ంలో పి.గన్నవరం నియోజ కవర్గంలో త్వరలో జరగబోయే చైతన్య యాత్ర ప్రాంతాలను అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ జియం.హరీష్‌ బాలయోగి శుక్రవారం పరిశీలించారు. చంద్రబాబు మే నెలలో జరిగిన మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టిడిపి ఆధ్వర్యంలో జోన్‌-2కు నాయకుకులతో బస్సు యాత్ర చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలో జరగనున్న బస్సు యాత్ర ప్రదేశాలను హరీష్‌ పరిశీలించారు. చైతన్య యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు చిత్తూరు శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ సాలాది పుల్లయ్య నాయుడు, మాజి ఎఎంసి ఛైర్మన్‌ మద్దాల సుబ్బారావు, కార్యదర్శి కుడిపూడి బుజ్జి మరియు నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.