Sep 15,2023 23:17

ప్రజాశక్తి-రామచంద్రపురం
కె.గంగవరం మండలంలోని సుందరపల్లి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాటర్‌ ట్యాంక్‌ నుంచి వచ్చే వాటర్‌ ఉదయం ఒక గంట వరకు మాత్రమే వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ పరిధిలో ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నాలుగైదు ఏళ్లుగా మూసివేయడంతో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ప్రజలు వేరే గ్రామాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ంలో గల మినరల్‌ వాటర్‌ ప్లాంటను పునర్నిర్మించాలని దీనిపై అధికారుల దృష్టి సారించాలని మంచినీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను నాయకులను కోరుతున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.