ప్రజాశక్తి-రామచంద్రపురం
సుస్థిర పాలన అందించడమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.మంగళవారం మంత్రి జగనన్నకు చెబుదాం అనుసంధానంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సుస్థిర పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వాటిలో ప్రతిష్టాత్మకమైనది జగనన్నకు చెబుదాం అనుసంధానంగా జగనన్న సురక్ష కార్యక్రమం ఒకటన్నారు. కార్యక్రమంలో మంత్రితోపాటు రామచంద్రపురం ఎంపిపి అంబటి భవాని, గ్రామ సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ, ఎంపిటిసి సభ్యుడు సుధాకర్, జెడ్‌పిటిసి సభ్యురాలు వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందరాజు, తహశీల్దార్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం నేలటూరు గ్రామ సచివాలయంలో సర్పంచ్ కుక్కల వీరన్న ఆధ్వర్యంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు వీర వెంకట సూర్యనారాయణ మూర్తి, ఎంపిడిఒ ఎం.రామకృష్ణారెడ్డి, తహశీల్దార్ కె.సూర్యారావులు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.










