Jul 12,2023 22:17

ప్రజాశక్తి -అంబాజీపేట
కొండేటి ఫౌండేషన్‌, మండల వైసిపి కుటుంబ సభ్యుల ద్వారా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నందంపూడికి చెందిన సీనియర్‌ నాయకులు వెన్నపు సత్య నారాయణ(బొంబాయి)కి బుధవారం రూ.51,500తో పాటు నిత్యావసరాలను పి. గన్నవరం ఎంఎల్‌ఎ తనయుడు కొండేటి వికాస్‌, సోదరుడు వెంకటేశ్వరరావులు అందజేశారు. నాగవవరపు నాగ రాజు ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించిన వారికి పార్టీ నాయకులను ఎంఎల్‌ఎ అభినందించారు. కార్యక్రమంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఎన్‌. నాగరాజు, పేరి శ్రీను, నాగవరపు నాగరాజు, అప్పన శ్రీనివాస్‌, రాలి వడియార్‌, ఎమ్‌. వెంకటేశ్వరరావు, పితాని వీరాస్వామి, చప్పిడి రాజు, వాకపల్లి శ్రీనివాసరావు, పెచ్చెట్టి వీరస్వామి, వెన్నపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.