Aug 21,2023 17:57

ప్రజాశక్తి-అమలాపురం
అర్జీదారుల సమస్యల పట్ల సకాలంలో స్పందించి నిర్ణీత గడువులోగా సంతృప్తికర స్థాయిలో పరిష్కార మార్గాలు పూర్తిగా చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జిల్లా స్థాయి అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాల్‌ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్య క్రమంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుఫూర్‌ అజరు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్‌.సత్తిబాబులు అర్జీదారుల నుంచి సుమారు 225 అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతతో కూడిన రీతిలో పూర్తిస్థాయి పరిష్కార మా ర్గాలు అర్జీదారులకు చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో స్పందన కార్యక్రమం లో ఆయా శాఖల వారీగా అందిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ చేపట్టి ఫోటోలతో సహా నివేదికలను అప్లోడ్‌ చేస్తూ నాణ్య తతో పరిష్కార మార్గాలు చూపా లన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలని ఆయన స్పష్టం చేశారు. అర్జీదారుని సంతప్తే ధ్యేయంగా ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక స్పందన, స్పందనకు మెరుగైన కార్యక్రమంగా అమలు కాబడు తున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిం చాలని ఆదేశించారు వివిధ శాఖల అధికారులు తమ లాగిన్‌ కు వచ్చిన అర్జీలను సకాలంలో విచారించి ఆన్లైన్లో అప్లోడ్‌ చేస్తూ గడువు దాటిన అర్జీలు లేకుండా రీఓపెన్‌ ఆస్కారం లేకుండా అర్జీల పరిష్కార సరళపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మండల తహశీల్దార్లతో ఓటర్లు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో పురోగతిపై సమీక్షించారు. ఇంటింటి సర్వే ప్రక్రియ నేటితో ముగియనున్నదనివెంటనే డేటా ఎంట్రీ ప్రారంభించి నిర్దేశత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. బిఎల్‌ఒ యాప్‌ లో డేటా ఎంట్రీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు ఒకే డోర్‌ నెంబర్‌ లో పది మంది పైబడి ఓటర్‌ ఉండకుండా ఎన్నికల సంఘం నిబంధనలను అమలు పరచా లన్నారు 18 నుంచి 20 మధ్య వయసుగల యువత యువకులు వివిధ కళాశాల్లో విద్యనభ్యసిస్తున్న వారిని గుర్తించి నూటికి నూరు శాతం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ సంబంధించి వరి నాట్లు వేసిన సమయాలను వ్యవసాయ అధికారులు అడిగి తెలుసుకుని ఆయా వరి పంట దిగుబడులను సమయాలను తెలుసుకొని ధాన్యం సేకరణ కొరకు ముందస్తుగా చేప ట్టాల్సిన సన్నద్ధత చర్యలపై ఆయన సమీక్షించారు.కార్యక్రమంలో జిల్లా గహ నిర్మాణ సంస్థ అధికారి సిహెచ్‌.బాబురావు, పంచాయతీ రాజ్‌ ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇలు కె.చంటిబాబు, సిహెచ్‌ ఎన్‌వి.కృష్ణారెడ్డి, డిఇఒ ఎం.కమల కుమారి, డిసిఒ రాధాకృష్ణారావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, గ్రామ వార్డు సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వరరావు, డిఎస్‌ఒ ఎ.పాపారావు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, మత్స్యశాఖ జెడి షేక్‌ లాల్‌ మహమ్మద్‌, డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర స వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టెండర్‌ ఆలస్యంపై జెసికి వినతి
ఆలమూరు: గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరైన రూ.20 లక్షల నిధుల టెండర్‌ లో జరుగుతున్న ఆలస్యంపై గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం రాంబాబు సోమవారం జిల్లా స్పందనలో కార్యక్రమంలో జెసి ఎస్‌.నుఫూర్‌ అజరుకి వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేయడంతో రూ. 20 లక్షలు నిధులు మంజూరు చేయగా వీటిని సిసి రోడ్డు నిర్మాణానికి పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. అయితే ఈ నిధులకు టెండర్‌ పిలవడంలో మూడు నెలలుగా యంత్రాంగం ఆలస్యం చేస్తున్నారని సర్పంచ జిల్లా జెసికి వినతిపత్రం అందజేశారు. సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై జెసి స్పందించి టెండర్‌ ఆలస్యంపై విచారణ చేసి, వెంటనే టెండర్‌ పిలిచి సిసి రోడ్‌ నిర్మాణం చేపట్టాలని పంచాయతీ అధికారులకు సూచించినట్లు సర్పంచ్‌ తెలిపారు.