ప్రజాశక్తి-రామచంద్రపురం
రామచంద్రపురం ఆర్‌డిఒ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 62 ఫిర్యాదు వచ్చాయని ఆర్‌డిఒ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించే విధంగా కషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు సూచించారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని సింధు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ వి. శివశంకర్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, నోడల్ అధికారి భీమేశ్వరరావు, డిఎస్‌ఒ ఎ.పాపారావు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ రామచంద్రపురం పురపాలక సంఘం కమిషనర్ కె. శ్రీకాంత్ రెడ్డి, తహశీల్దార్ తారకేశ్వరరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ద్రాక్షారామ-రామచంద్రపురం
రోడ్డు ఆధునికీకరించాలి
ద్రాక్షారామ నుంచి రామచంద్రపురం మెయిన్ రోడ్డు గోతులుపడిందని, అయిదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ రోడ్డును ఆధునీకరించాలని ఆర్‌డిఒ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వాహానదారులు, ప్రజలు గుంతల్లో పడి గాయాలుపాలు అవుతున్నారని. రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారిందని. తక్షణం రోడ్డుమీద ఉన్న గోతులు పూడ్చాలని జిల్లా జెసి, ఆర్‌డిఒకు నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు జాయింట్ కలెక్టరు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి రామరాజు కాపు,కొప్పుల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.










