Aug 04,2023 17:51

ప్రజాశక్తి-యంత్రాంగం
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా శుక్రవారం పలుచోట్ల గర్భిణులకు, బాలింతలకు పోషణ కిట్లను ప్రజాప్రతినిధులు అందజేశారు.
ఆలమూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషన్‌ పక్వాడతో గర్భిణీలకు, బాలింతలకు సమృద్ధికరమైన ఆరోగ్యం చేకూరుతుందని కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న పోషణ్‌ పక్వాడ కార్యక్రమాన్ని ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ నాతి లావణ్య కుమార్‌ రాజా అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఎంఎల్‌ఎ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, వైసిపి మండల కన్వీనర్‌ తమ్మన శ్రీనివాస్‌, ఎఎంసీ చైర్మన్‌ యనమదల నాగేశ్వరరావు, తహశీల్దార్‌ ఐపి.శెట్టి, ఎంపిడిఒ జాన్‌ లింకన్‌ తదితరులు పాల్గొన్నారు. మండపేట: పౌష్టికాహారంతోనే ఆరోగ్యమని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. స్థానిక డొక్కా సీతమ్మ భవన్‌ లో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా ప్రభుత్వం గర్భిణులకు, బాలింతలకు అందించే టేక్‌ హోమ్‌ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి ప్రారంభించారు. తల్లి పాల ప్రాముఖ్య తను అవగా హన కల్పించి 45 మంది గర్భిణులకు సామూహిక సీమంతలు చేశారు. కార్యక్రమములో వైస్‌ ఛైర్‌పర్సన్‌ పిల్లి గణేశ్వరరావు, టౌన్‌ కన్వీనర్‌ ముమ్మిడివరపు బాపిరాజు, కౌన్సిల్‌సభ్యులు, అంగన్‌వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.