Jul 24,2023 23:31

ప్రజాశక్తి-మండపేట జిల్లావ్యాప్తంగా నాలుగు అర్బన్‌ సెంటర్ల ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న అర్బన్‌ ఆశా వర్కర్‌ లందరికీ జనాభా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైలైన్స్‌ ప్రకారం అర్బన్‌ ఆశా వర్కర్లకు 2500 జనాభాకి సేవలందించాలన్నారు. ప్రస్తుతం సచివాలయలు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరిని ఒక్కో సచివాలయానికి కేటాయించడం చేయడం దారుణమన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అందించే సేవలు దూరం అవుతాయన్నారు. ఇప్పటికే ఆశా వర్కర్లకు ఆన్లైన్‌, రికార్డు పనులు చేయాలని అధికారులు ఒత్తిడి ఉందన్నారు. మండపేట, రామచంద్రపురం, అమలాపురం, ముమ్మడివరం నాలుగు అర్బన్‌ సెంటర్లలో ఆశా వర్కర్లకి 4000 నుంచి 5000 వరకు జనాభా కలిగి ఉన్నారన్నారు. ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు సంపూర్ణంగా అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాయకులు సీతారత్నం ఉమాదేవి, మేరీ, భువనేశ్వరి, రమాదేవి, సుజాత, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.