Jul 01,2023 23:25

ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజా సమస్యలపరిష్కారం ప్రభుత్వం ప్రకటించిన జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని జగనన్నసురక్ష గురించి వివరించారు.
అమలాపురం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారు లందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. విశ్వరూప్‌ పేర్కొన్నారు. శనివారం అల్లవరం మండలం తాటికొన, ఉప్పలగుప్తం మండలం , ఎన్‌. కొత్తపల్లి గ్రామ సచివాలయ క్యాంపు కార్యక్రమాల్లో పాల్గొని కుల ఆదాయ తదితర ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లా డుతూ సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు పౌర సేవలు సంతప్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఒకటో వార్డు మెట్ల కాలనీ గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమంలో ఎంఎల్‌సి కె.సూర్యనారాయణరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి లబ్ధి చేకూర్చను న్నారన్నారు. మరో ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల, పురపాలక సంఘ చైర్‌ పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్‌ చైర్మన్‌ నాని బాబు తదితరులు హాజరయ్యారు. అయినవిల్లి అయినవిల్లిలంక, అయినవిల్లి గ్రామల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం తహశీల్దార్‌ నాగలక్ష్మమ్మ అధ్యక్షుతన నిర్వహించారు. ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పాల్గొని అర్జీదారులకు మంజూరైన పలు రకాల ధ్రువపత్రాలను వారి చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఎంపిపి మట్టపర్తి నాగ విజయలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, ఎంపిడిఒ తాడి వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట జగనన్న సురక్ష పేదలకు రక్ష గా ఉంటుందని ఎంపిపి మార్గం గంగాధర్‌ రావు అన్నారు. ఖండ్రిగ గ్రామం సచివాలయం నందు జగనన్న సురక్ష క్యాంప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యురాలు గూడపాటి రమాదేవి, గొల్లపల్లి డేవిడ్‌రాజు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం ఎన్‌.కొత్తపల్లి సచివాలయం-1 లో ఎంపిడిఒ,కెఎస్‌ గౌరీ కుమారి అధ్యక్షతన శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్‌ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తో కలిసి పాల్గొని పలువురికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ అర్హత కలిగి ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని అధికార యంత్రాంగం గుర్తించి వారికి పథకాలు అందించడం ఈ కార్యక్రమంలో జరుగుతుందన్నారు.కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఆలస్యం కాకుండా ఉచితంగా ఆయా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం జరుగు తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుంచే చిట్టికుమారి, జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, సొసైటీ అధ్యక్షులు నడింపల్లి వాసు రాజు, తహశీల్దార్‌ జె.వెంకటేశ్వరి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రామచంద్రపురం ప్రభుత్వం నెల రోజుల పాటు ఉచితంగా మీకు అవసరమైన సర్టిఫికెట్‌ లు అందించే గొప్ప కార్య క్రమం జగనన్న సురక్ష అని జిల్లా జెసి ధ్యాన చంద్ర అన్నారు. రామచంద్రపురం మండలం లోని అన్నాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయం లోనూ 13 రకాలైన సర్టిఫికెట్లు పొందేందుకు అవకాశం ఉందని,దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అవసరమైన సర్టిఫికెట్లు పొందేందుకు వైసిపి ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని, జెడ్‌పిటిసి సభ్యురాలు మెర్నీడి వెంకటేశ్వరరావు, అన్నాయిపేట సర్పంచ్‌ దొరబాబు, వైసిపి నాయకులు టేకుమూడి సత్యనారాయణ, వెంకటాయపాలెం సర్పంచ్‌ ఎల్లమిల్లి సతీష్‌ కుమారి, ద్రాక్షారామ సర్పంచ్‌ కొత్తపల్లి అరుణ, ఆర్‌డిఒ పి.సింధు తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపిడిఓ కె.జాన్‌ లింకన్‌ అధికారులకు పిలుపు నిచ్చారు. పెదపల్లలో జగనన్న సురక్ష కార్యక్రమం సర్పంచ్‌ ఏడిద సత్యశ్రి మెహర్‌ ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించారు.కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు నెక్కంటి బుజ్జి వైసిపి గ్రామ అధ్యక్షులు గొడితి వెంకన్న, ప్రత్యేక అధికారి, డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శివశంకర ప్రసాద్‌, శాఖల అధికారులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ప్రభుత్వ విప్‌ మరియు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి అన్నారు శనివారం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలంలోని పేరవరం బొబ్బర్లంక గ్రామాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు బాణం సాయిబాబా, ఎంపిపి కుండా అన్నపూర్ణ, తహశీల్దార్‌ డివిఎన్‌.అనిల్‌ కుమార్‌ ఎంపిడిఒ నాతి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మండపేట స్థానిక సీతారామ కమ్యూనిటీ హాలులో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న సురక్షలో భాగంగా వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, మున్సిపల్‌ చైర్పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి, కమిషనర్‌ త్రిపర్ణ రామ్‌ కుమార్‌ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.