ప్రజాశక్తి-అమలాపురం
సార్వత్రిక తదితర ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కచ్చితత్వంతో కూడిన ఓటరు జాబితా అత్యంత మూలమని ఆ దిశగా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సిబ్బందిని ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు డిఆర్‌ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటి సర్వే బిఎల్‌ఒ రిజిస్టర్లు, బిఎల్‌ఒ యాప్లు పనితీరు, తదితర వివిధ అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విశిష్టతను పెంపొందించే చర్యల్లో భాగంగా ఓటర్ల జాబితా అత్యంత నాణ్యత ప్రమాణాలతో రూపొందిం చాలని స్పష్టం చేశారు. ఓటర్లు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా అర్హులైన పౌరుల పేర్లను జాబితాలో చేర్చి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును రాజ్యాంగబద్ధంగా వినియోగించుకునే అవకాశం హ క్కును కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణలో భాగంగా అనర్హులను మరణించిన వారి వలసలు వెళ్లిన వారి ఓట్లను నిర్దేశిత ప్రొసీజర్ ప్రకారం నోటీసులు జారీ చేస్తూ తొలగింపులు చేపట్టాలన్నా రు. ఇంటింటా సర్వే ను ఈనెల 21 నాటికి పూర్తి చేసి ఆ యొక్క నివేదికలను యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే అత్యంత పారదర్శకంగా నిర్వ హిస్తూ దోషరహిత జాబితాను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో 5,22,090 గహాలు ఉండగా వీటిలో 1,06,695 గహాలను బిఎల్‌ఓ యాప్ ప్రకారం సర్వే జరిగిందన్నారు. జిల్లాలో 2,47,351 గహాల సర్వే పూర్తి చేయడం ద్వారా 47% ఇంటింటి సర్వే భౌతికంగా పూర్తయిందని తెలిపారు. 100 సంవ త్సరాలు వయస్సు పైబడిన ఓటర్లు 105 మంది వరకు జిల్లాలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజరు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు ఎన్నికల జాబితా రూపకల్పన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










