Jul 23,2023 23:30

ప్రజాశక్తి-అంబాజీపేట
పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సిఎం జగన్‌ అమలాపురం పర్యటనను విజయవంతం చేయాలని ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డు నందు మండల శాఖ ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన నాయకులు కార్యకర్తలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ రాయితీ నిధులు పంపిణీకి ఈనెల 26న విచ్చేయుచున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో మహిళా సంయుక్త సంఘాలతో పాటు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్‌పిటిసి బూడిద వరలక్ష్మి, వైస్‌ ఎంపిపి నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, పేరు శ్రీను, ఎం ప్రశాంత్‌, ఉందుర్తి నాగబాబు, కడలి సుబ్బారావు,జి.శ్రీరామమూర్తి నాయకులు పాల్గొన్నారు.