ప్రజాశక్తి-అమలాపురం
ఎపి సిఎం జగన్ ఈనెల 26న అమలాపురం విచ్చేసి డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీనిధులు జమ చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎంఎల్‌సిలు, రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటనల సమన్వయకర్త తలశిల రఘురాం అధికారులకు సూచించారు. శనివారం స్థానిక పోలీస్ క్వార్టర్స్ నందు ఏర్పాటుచేసిన హెలిపాడ్ ఏర్పాట్లను, స్థానిక జిఎంసి బాలయోగి స్టేడియం నందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని ఆయన రాష్ట్ర రవాణా శాఖ పి.విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాలతో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్లలో నిమగమైన అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం పర్యటనకు సంబంధించిన ప్రతి ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతూ పర్యటనను విజయవంతం గావించాలని సూచించారు. పర్యటనకు విచ్చేసే వివిఐపీలకు స్థానిక అధికారులు ప్రోటోకాల్ పాటించాలన్నారు. రహదారులు భవనాల శాఖ అధికారులు హెలిప్యాడ గ్యాలరీలు తదితర ఏర్పాటు ముఖ్యమంత్రి పర్యటించే రోడ్లు సభా ప్రాంగణం వద్ద అప్రోచ్ రోడ్లు పక్కాగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా గ్రామీణ అభి వద్ధి సంస్థ పదక సంచాలకులు సభా ప్రాంగణానికి విచ్చేసే మహి ళలు సభా ప్రాంగణం లో సిట్టింగ్ ఏర్పాట్లు వంటి కనీసవసతులు కల్పించాలని సూచించారు. ట్రాన్స్కో అధికారులు నిరంతరాయంగా ముఖ్యమంత్రి పర్యటన సంబంధించిన సమయం అంతా విద్యుత్ సరఫరాను అందిం చాలన్నారు. జిల్లా యంత్రాంగం స్టేజ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా మరియు పారిశుధ్య విభాగం వారు సభా స్థలానికి విచ్చేసే ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని సూచించారు పోలీస్ యంత్రాంగం సభాస్థలికి దూరంగా పార్కింగ్ ప్లేస్ ను కేటాయించి శాంతిభద్రతలు కాపాడడంతోపాటు ట్రాఫిక్ జామ్ కు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ పి. విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్.శ్రీధర్, ఆర్‌డిఒలు ఎం.ముక్కంటి, ఎన్‌ఎస్‌వి బి.వసంత రాయుడు తదితరులు పాల్గొన్నారు.










