రంగాపురంలో సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న చేనేత కార్మికులు
ప్రజాశక్తి - అమలాపురం రూరల్
సిఎం జగన్ చిత్రపటానికి శ్రీరామలింగేశ్వర చేనేత సహకార ఉత్పత్తి సంఘం అధ్యక్షులు కరెళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం పాలాభిషేకం చేశారు. వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం 5వ విడత సొమ్ముల విడుదల సందర్భంగా అమలాపురం రూరల్ సమనస గ్రామపంచాయతీ రంగాపురంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ కరెళ్ళ రమేష్‌బాబు ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కరెళ్ళ నాగరాజు, డైరెక్టర్ కరేళ్ల మహేష్, సచివాలయ కన్వీనర్ అక్కిశెట్టి ప్రసాద్, సమనస, వన్నెచింతలపూడి, రంగాపురం గ్రామాల చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










