Sep 07,2023 22:57

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌
సేవా కార్యక్రమాలు చేయడంలో వన్నె చింతలపూడి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని కిమ్స్‌ ఛైర్మన్‌, మాజీ ఎంఎల్‌సి కెవివి.సత్యనారాయణ రాజు(చైతన్యరాజు) పేర్కొన్నారు. గురువారం అమలాపురం మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో ఎడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ (అమెరికా) వారు ఏర్పాటు చేసిన ఆర్‌ఒ ప్లాంట్‌ను చైతన్య రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా సర్పంచ్‌ నక్కా రాజరత్న నాగవాణి కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైతన్య రాజు మాట్లాడుతూ మొత్తం గ్రామానికి పూర్తిగా వైద్యం అందిస్తామని తెలిపారు. క్షత్రియ సేవ సమితి ద్వారా పలుసేవ కార్యక్రమాలు చేస్తున్న నడింపల్లి వెంకటరామరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ శాస్తవేత పరమట రాధాకృష్ణ, ఎంపిటిసి సభ్యులు పరమట నాగమణి విష్ణుప్రసాద్‌, డిఎస్‌ఎన్‌.రాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ పాలాటి బాలయోగి, పచ్చి మాల బాబ్జి, భూపతిరాజు త్రిమూర్తులు రాజు, కుంచె వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.