Jul 20,2023 16:30

ప్రజాశక్తి-రామచంద్రపురం : కే గంగవరం మండలంలోని సత్యవాడ గ్రామ మాజీ సర్పంచ్ తోట ఈశ్వరకృష్ణ నాగ సర్వరాయుడు అలియాస్ కాశి గురువారం అకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన హైదరాబాదులో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2001 2007 సంవత్సరంలో ఆయన గ్రామ సర్పంచ్ గాను అటు తరువాత నీటి సంఘం అధ్యక్షులుగా కొనసాగారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతికి గ్రామ సర్పంచ్ సలాది శీను, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.