ప్రజాశక్తి-కపిలేశ్వరపురం మండలంలోని వడ్లమూరులో ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన బుధవారం ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు ప్రారంభించారు. జెడ్‌పి నిధులు రూ.15 లక్షలతో నిర్మించనున్న బిసి కమ్యూనిటీ హాలు, రూ.10 లక్షలతో నిర్మించనున్న రజిక కమ్యూనిటీ హాల్స్ కు ఎమ్మెల్సీ తోట శంకుస్థాపన చేశారు .అనంతరం గ్రామ సర్పంచ్ చుండ్రు మంగయమ్మ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆయన పార్టీ నాయకులతో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎంఎల్‌సి తోట బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్‌పిటిసి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్, మాజీ జెడ్‌పిటిసి చుండ్రు చిట్టిబాబు, ఎంపిటిసిలు పలివెల మధు, పెందుర్తి శిరీష, ఎంపిడిఒ, ఎం.రామకష్ణారెడ్డి పాల్గొన్నారు.










