ప్రజాశక్తి-మామిడికుదురు
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు, సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాద్ అన్నారు. గోగన్నమఠంలో ఎంజి ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని సర్పంచ్ అల్లు విజయలక్ష్మితో కలసి సోమవారం ఎంఎల్‌ఎ ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పి టిసి సభ్యుడు కె.అంజిబాబు, సర్పంచులు అడ బాల తాతకాపు, బళ్ళ శ్రీనివాసరావు, వైస్ ఎం పిపి భూపతి రాజు లక్ష్మి, సొసైటీ ఛైర్‌పర్సన్ సాయి నరసింహ వర్మ, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సూరిశెట్టి బాబి, రాజోలు ఎఎంసి ఛైర్‌పర్సన్ జి.రోజారమణి, ఎంపిడిఒ కె.వెంక టేశ్వరరావు, కె.శ్రీధర్ పంచాయతీ కార్యదర్శి పిఎస్‌విఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










