Aug 11,2023 18:40

ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం ఎస్‌వి డిగ్రీ కళాశాల్లో ప్రిన్సిపల్‌ మనోహర్‌ అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పర్యావరణ విభాగం హిరోషిమా, నాగసాకి డేల దశ దిన కార్యక్రమాల ముగింపులో శుక్రవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. జెవివి రాష్ట్ర పర్యావరణ కన్వీనర్‌ కెవివి.సత్యనారాయణ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సమాజ అభ్యున్నతికి ఉపయోగపడాలని, మానవ వినాశనానికి కాదన్నారు. మానవతావాది చేతిలో సైన్స్‌ ప్రజలకు సౌకర్యాలను కల్పించి, అవసరాలను తీరుస్తుందనీ ఉన్మాదుల చేతిలో అదే విజ్ఞానము వినాశనాన్ని సృష్టిస్తుందని అన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్లో అమెరికా చేతిలోని సాంకేతిక విజ్ఞానం రెండు పట్టణాలను ధ్వంసంచేసిందన్నారు. అందుకే అణ్వస్త్రాలు వద్దు అన్నవస్త్రాలు కావాలని 'జెవివి' డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రపంచ దేశాలు స్నేహం, సౌభ్రాతత్వాలతో మెలగాలన్నారు. ప్రధాన వక్త డాక్టర్‌ బి.రాంప్రసాద్‌ మాట్లాడుతూ సుమారు 2 లక్షల 50 వేల మంది ప్రాణాలు హిరోషిమా, నాగసాకి అణ్బాంబు విస్ఫోటనంలో చనిపోయా యన్నారు.. అందులో 90 శాతం పైగా పౌరులే ఉన్నారని అన్నారు. యుద్ధోన్మాదం ఫలితంగా అణు బాంబు విస్ఫోటనం వలన నేటికీ అక్కడి భూమిలో పంటలు పండడంలేదు. చాలామందికి సంతానం యోగం లేదన్నారు. పుట్టిన వారిలో ఎక్కువమంది శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారన్నారు.. అదే యుద్ధం నుంచి గుణపాఠం నేర్చుకున్న జపాన్‌ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ను ఉపయోగించి పూర్వ అభివద్ధి స్థాయికి చేరుకుందన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డా. ఇఆర్‌.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో, ప్రజలలో శాస్త్రీయ అవగాహనకు, అక్షర ఉద్యమం, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తుందన్నారు. ఆ వాణిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి చెకుముకి సైన్సు మాస పత్రిక ద్వారా వినిపిస్తుం దన్నారు. దేశ స్వావ లంబన, ప్రపంచ శాంతి కోసం పరితపిస్తోందన్నారు. అందుకే హిరోషిమా, నాగసాకి డేల సందర్భంగా గుణపాఠం నేర్చుకోవా లన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ఛైర్మన్‌ ప్రవీణ్‌, సీనియర్‌ ఫ్యాకల్టీ వరప్రసాద్‌ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.