Aug 25,2023 23:31

ప్రజాశక్తి-అయినవిల్లి
మండలంలోని సిరిపల్లి వ్యవసాయ క్షేత్రంలో వైయస్సార్‌ పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి వై శోభ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు దీనిలో భాగంగా రైతులకు పొలంబడిలో గ్రూప్‌ సభ్యులు తో రైతులకు మిత్రపురుగులు, శత్రు పురుగులు ను గమనించి అవగాహన కల్పించారు. వసాయ భాగస్వామ్య కార్యాచరణ పరిశోధన రైతులతో చేయంచారు. గ్రూప్‌ డైనమిక్స్‌ లో భాగంగా జంతువులు లాగా అరవడం మరియు వాటర్‌ బాటిల్‌ లో పెన్‌ పెట్టడం మరియు వేప గింజల కషాయం గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు టి.సురేష్‌ రైతులు పాల్గొన్నారు.