Sep 16,2023 11:13

ప్రజాశక్తి-రామచంద్రపురం : డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా/రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. రామచంద్రపురం రూరల్ మండలం పార్టీ నాయకులుబాబు తోనేను తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ  రిలే నిరాహారదీక్షలో కొనసాగిస్తున్నారు. రామచంద్రపురం తెలుగుదేశంపార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రిలే నిరాహార నిరసన దీక్ష 4వ రోజు ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పూలమాలవేసి ప్రారంభించినారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వివిధ వర్గాల నుండి సంతకాలు సేకరణ, అభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రిలే నిరాహారదీక్ష కు  అన్ని వర్గాల , సంఘాల నాయకులు  సంఘీభావం తెలియజేసారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, క్లస్టర్ , యూనిట్ ఇన్ ఛార్జ్  లు,  మండల కమిటీలోని నాయకులు గ్రామాల పార్టీ  కార్యకర్తలు పాల్గొన్నారు.