Sep 04,2023 23:36

ప్రజాశక్తి-రాజోలు
రాజోలు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్‌ కుమారుడు సుఖేష్‌, శ్రీరంగ నాయకి ల వివాహం సందర్భగా ఏర్పాటు చేసిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయిస్‌లో, కేరళ వాయిద్యాలతో, మిరుమిట్లు గొలిపే బాణసంచాతో, యువతుల బులెట్‌ బండ్ల డ్రైవింగ్‌ విన్యాసాలతో వధూ, వరులను రాజోలు పుర వీధుల్లో ఊరేగించారు. మండపేట నుంచి వచ్చిన సాంప్రదాయ దుస్తులు ధరించి చేసిన బుల్లెట్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.