ప్రజాశక్తి-అమలాపురం రూరల్
అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి లో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న నూతన రోడ్లు కు శుక్రవారం సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి, జెడ్‌పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి తదితరులు భూమిపూజ చేశారు. అలాగే రూ.1.8 కోట్ల తో నిర్మించిన నూతన తారు రోడ్డు ను పరిశీలించారు. కార్యక్రమంలో కార్యదర్శి కట్టా సత్తిబాబు, సెంట్రల్ డెల్టా ఛైర్మన్ కుడుపూడి బాబు, ఎంపిటిసి సభ్యుడు సత్తి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










