ప్రజాశక్తి-అమలాపురం
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, వైయస్సార్ యంత్ర సేవ, వైయస్సార్ ఉచిత పంటల బీమా వంటి పలు విప్లవాత్మక రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శనివారం జరిగిని నాలుగో ఏడాది వైఎస్‌ఆర్ ఉచిత పంటలు బీమా నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి విశ్వరూప్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎంఎల్‌ఎ చిట్టిబాబు, రాష్ట్ర దశ్యకళల అకాడమీ ఛైర్పర్సన్ కుడిపూడి సత్య శైలజ, పురపాలక సంఘ ఛైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వక్ఫ్ బోర్డ్ ఛైర్‌పర్సన్ షేక్ అబ్దుల్ ఖాదర్ స్టానిక కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. తొలుత వైఎస్‌ఆర చిత్రపటానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతర మంత్రి ూట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో అభివద్ధి కార్య ప్రవేశపెట్టారని, మరలా ఆయన తనయుడు, ప్రస్తుత సిఎం వైఎస్ జగన్ మరింత ముందు చూపుతో రైతు అభ్యున్నతిని కోరుతూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ వ్యవసాయం వాటి అనుబంధ రంగాలలోని ఆధునిక పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు దరిచేరితేనే సాంకేతికతకు సార్ధకత చేకూరుతుందని, ఆ దిశగా వ్యవ సాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలన్నారు. వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ రైతు దినోత్సవం జరుపుకోవడం జరిగిందన్నారు వ్యవసాయ విస్తరణ సేవలు బలోపేతం, సాగులో మెలకువలను రైతులు తెలుసుకొని తక్కువ పెట్టుబడితో నాణ్యమైన లాభ సాటి ఉత్పత్తులు సాధించాలన్నారు. సహజ సిద్ధ వనరులతో ఆధునిక సేద్య విధానాలను అవలంబించాల న్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2022 ఏడాదిలో వైఎస్‌ఆర్ ఉచిత పంటలు బీమా కింద జిల్లాలో 25,229.5 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నష్టపోయిన 28,686 మంది రైతు లకు సంబంధించి బీమా పరిహారం గా రూ.20,44,59,279 లు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మేలు జాతి వంగడాల విత్తనాలను వారు రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు నాని బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసుబాబు, వ్యవసాయ సహాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










