ప్రజాశక్తి-కపిలేశ్వరపురం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు అన్నారు. గురువారం నల్లూరు గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధులు రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన నల్లూరు గ్రామంలో 90 మంది కౌలు రైతులకు రుణాలు అందజేసినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించిన వేగుళ్ల వీరరంగా ప్రభాకరచౌదరిని ఎంఎల్‌సి తోట అభినందించారు. చేనేత సంఘానికి ప్రతి నిధులు లేరని సమస్య పరిష్కరించాలని సొసై టీ మాజీ ఛైర్మన్ ఎ.శంభులింగం ఎంఎల్‌సి తోట దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పంది ంచి సంబంధిత ఎడితో, జిల్లా కమిషనర్ తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపిపి మేడిశెట్టి సత్యవేణి, జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, ఉప సర్పంచ్ మార్ని అనంతలక్ష్మి, పుట్ట కృష్ణ బాబు, ఎంపి డిఒ ఎం.రామకృష్ణారెడ్డి, ఎఒ రమేష్ కుమార్, మండల జెఇ డివి.రాఘవులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ భాగ్యరాజు, గ్రామ కార్య దర్శి ఎస్ సుధా రాణి, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు, పాల్గొన్నారు.
సత్రం పున: ప్రారంభం
మండపేట స్థానిక కలువపువ్వు సెంటర్లోని టౌన్ హాల్ వద్ద ఉన్న కామాక్షి ఏకామేశ్వర కల్యాణ మండపాన్ని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, వార్డు కౌన్సిలర్ ముక్కా లోవలక్ష్మి దాలయ్యలు గురువారం పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తోట మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులంటే సష్టికి మూలమని పంచవత్తులుగా విశ్వబ్రాహ్మణులు తమ వత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ బిక్కిన కష్ణార్జున చౌదరి, వైసిపి రాష్ట్ర నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరావు, ఆలయ కమిటీ చ్కెర్మన్ మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.










