Sep 07,2023 22:35

ప్రజాశక్తి-అమలాపురం
ఎపికి ప్రత్యేక హోదా అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో పాదయాత్ర చేపట్టి ఏడాది అయిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అమలాపురం పట్టణంలో భారత్‌ జోడో పాదయాత్ర జరిగింది. పట్టణంలోని గడియార స్తంభం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిఅక్కడి నుంచి ఈదరపల్లి వంతెన వద్ద నున్న అంబేద్కర్‌ విగ్రహం వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సభను నిర్వహించారు. .సభకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్‌ రావు అధ్యక్షత వహించారు. బిజెపి పెట్టుబడిదారులు కొమ్ముకాస్తూ పేదలను దోచుకుంటుందని కామన ప్రభాకర్‌ రావు విమర్శిం చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. గౌతమ్‌ మాట్లాడు తూ కేంద్రంలోని తొమ్మిది ఏళ్ల బిజెపి పాలనలో దేశంలో విద్వేష రాజకీయాలు తారాస్థాయికి చేరాయన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌, ఎఐసిసి సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వంటెద్దు బాబి, పిసిసి సభ్యులు అయితా బత్తుల సుభాషిని, గోపాలకృష్ణంరాజు, ముషిని రామకృష్ణ రావు, మాచవరపు శివన్నారాయణ, సంగీత సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు