Jul 14,2023 17:19

ప్రజాశక్తి-రామచంద్రపురం
ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికకు రామచంద్రపురం లో రాజరత్న కిట్స్‌ కళాశాల శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఐడియల్‌ టెక్నికల్‌ అవార్డు ప్రోగ్రాం 2023 ను ప్రకటించింది. ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అక్టోబర్‌ 2న జరిగే కార్యక్రమంలో ఐ టాప్‌ అవార్డులతో సత్కరిస్తారని కళాశాల డైరెక్టర్‌ ఎం.పవన్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డుల ఎంపికకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరి ంచారు. డిఇఒ తిరుమలరావు, ఎంఇఒ సోమిరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌ బర్ల, డైరెక్టర్‌ రామారావు, రవీందర్‌, శ్రీకాంత్‌, అవార్డుల ప్రదాన అధికారి సురేష్‌ కుమార్‌ తదితరులు హాజరై ప్రసంగించారు. దేశంలోని అధ్యాపకులను ప్రథమ పౌరులుగా గుర్తించాలనే లక్ష్యంతో కొనేళ్లగా కిట్స్‌ రాజరత్న కళాశాల ఐ టాప్‌అవార్డులను అందజేస్తుందన్నారు. గమనము మరియు యంత్రము అనే స్ఫూర్తితో రూపొందించిన కార్యక్రమాల్లో దేశ, విదేశాల నుంచి వచ్చిన ఇన్నోవేషన్‌ యంత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారని వివరించారు. దేశం నలుమూలలు నుంచి వచ్చిన అధ్యాపకుల ఆవిష్కరణలను పరిశీలించి అక్టోబర్లో అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.