ప్రజాశక్తి-రామచంద్రపురం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలోధ్వజమెత్తరు. శనివారం ద్రాక్షారామ వచ్చిన ఆ యన స్థానిక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిపి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరే ఒరే అన్న స్థాయికి దిగజారవని, హిందూ ధర్మంపై నమ్మకం లేదనిఎవరో పేపర్ మీద రాస్తే చదివే పేయిడ్ ఆర్టిస్ట్ నువ్వు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదేవిధంగా చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావని, అన్నవరంలో నకిలీ పురోహితులు నీ దగ్గరకు వచ్చి చెప్తే పురోహితులను వేలం వేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదు అన్నారు. అన్నవరం అన్ని రకాలుగా అభివద్ధి చెందుతుందన్న విషయం నీకు తెలుసా అని ప్రశ్నించారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్తోమత ఉన్న వారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని, అన్నవరం దళారీ వ్యవస్థనిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని తెలియజేశారు. ఆలయంలో జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని
అన్నవరంలో సరాసరి ఏడాదికి 7 లక్షలు వ్రతాలు జరుగుతాయి 4 వేల వివాహాలు జరుగుతాయని బ్రోకర్ల పనులకి అడ్డుకట్ట పడిందనే వీళ్లంతా పవన్ కల్యాణ్ సంప్రదించారన్నారు. పవన్ కల్యాణ్ నీచంగాదిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని, ఎంఎల్‌ఎ కూడా కాలేని వాడివి 151 స్థానాలు సాధించిన వ్యక్తిపై ఆరోపణ చేస్తావా అంటూ దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ కి ఎప్పుడూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ పైనే దృష్టి ఉంటుందని ప్రజా నాయకుడైన సిఎం జగన్ విమర్శిస్తే ప్రజలే నీకు మరోసారి బుద్ధి చెప్తారన్నారు.
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రోజుకు రకంగా మాట్లాడే నైజం పవన్ కల్యాణ్ అని ప్రతిపాడు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు అనేక విషయాలను గొడవలను సష్టించారన్నారు వాలంటీర్ల మీద లేనిపోని ఆరోపణలు చేశారని అదే విధంగా కులాల మీద వర్గాల మీద ఆరోపణలు తగదని మంత్రి వేణు హెచ్చరించారు .










