Sep 08,2023 20:51

ప్రజాశక్తి-అంబాజీపేట
ప్రతి రైతు ఖరీఫ్‌ పంటతో పాటు ఉద్యాన పంటలు సాగు చేసే వారందరూ పంట నమోదు చేయించుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్‌జెవి.రామ్మోహనరావు పిలుపునిచ్చారు. అంబాజీపేట వ్యవసాయ శాఖ కార్యాలయం నందు సలహా మండలి ఛైర్మన్‌ ఎంఎం.శెట్టి అధ్యక్షతన శుక్రవారం మండల సలహా మండలి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎంపిపి దొమ్మేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌బికెల్లో ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని వాటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎఒ సిహెచ్‌డి.విజయకుమార్‌, ఎఇఒ దుర్గారావు, మరియు సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.