Aug 04,2023 18:37

రైతులకు విత్తనాలు అందిస్తున్న సర్పంచ్‌ రేవతి

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర ఉత్పత్తులు
ప్రజాశక్తి - అంబాజీపేట
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల నుంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పొందొచ్చని సర్పంచ్‌ వాసంశెట్టి రేవతిపెదబాబు అన్నారు. వక్కలంకలో ఎస్‌సి కార్పొరేషన్‌ నుంచి వచ్చిన అపరాల విత్తనాల కిట్లను ఎస్‌సి రైతులకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చేల గట్లలో కూరగాయల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చన్నారు. అనంతరం సిబ్బంది రైతులకు ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌ రిసోర్స్‌ పర్సన్‌ జనిపల్లి నాగవేణి, పంచాయతీ కార్యదర్శి తాతాజీ, విఎఎ బాలాజీ, బి.సౌజన్య, విఆర్‌ఒ రాజ్‌కుమార్‌, గుణశేఖర్‌ ఐసిఆర్‌పి జి.పల్లయ్య, రైతులు నెల్లి నాగేశ్వరరావు, చింతల తాతారావు, గంటి సత్యనారాయణ, విష్ణు ప్రసాద్‌, గంటి ఏడుకొండలు, సబ్బితి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.