ప్రజాశక్తి-రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణంలో కొత్తగా మంజూరైన 266 పింఛన్లను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ శుక్రవారం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న దని వివరించారు. లబ్ధిదారులు ఖాతాలోనే జమ కావడం లబ్ధిదారుల పాలిట గొప్ప వరం అన్నారు. పెన్షన్ పొందిన లబ్ధిదారులకు తమ దైనందిన జీవితంలో ఎంతో తోడ్పాటును అందిస్తుందని, ముఖ్యంగా వైద్య ఖర్చులకోసం తమ సొంత అవసరాల కోసం ఈ పెన్షన్ చేయూతనిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మండల ఎంపిపి అంబటి భవాని, మున్సిపల్ కమిషనర్ కె.శ్రీ కాంత్ రెడ్డి, ఎంపిడిఒ సలట్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










