Aug 30,2023 23:36

ప్రజాశక్తి-అమలాపురం
'ప్రజాశక్తి' పత్రిక అను నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. అమలాపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి విశ్వరూప్‌ బుధవారం 'ప్రజాశక్తి' 43వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రిక పరిశీలనా, పరిశోధనాత్మకం కథనాలు ప్రచురించడంలో సాటి అని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రజలు మన్ననలు పొందుతూ 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజాశక్తి దినపత్రికకు ఆయన ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్‌ పావనమూర్తి, ఉప్పలగుప్తం జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, ఉప్పలగుప్తం మం డల సర్పంచ్‌ల సమైక్య అధ్యక్షుడు కమిడి చిన్నవరావు, జిల్లా పాత్రికే యులు సురేష్‌,కుమార్‌, రాజశేఖర్‌, వీరబాబు,భీమేశ్వరరావు పాల్గొన్నారు.