Jul 02,2023 23:45

ప్రజాశక్తి-అమలాపురం
రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు జక్కంపూడి కిరణ్‌, ఎంఎల్‌సికుడుపూడి సూర్య నారాయణలతో కలసి ఆదివారం అమలాపురం పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్డిగూడెంలోని ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను వారి దృష్టికి విద్యార్థులు తీసుకు వచ్చారు. వాడకం నీరు కూడా సరిగా ఉండడం లేదని, వసతి గృహం చుట్టూ ప్రహరీకి ఫెన్సింగ్‌ వేయించాలని కోరారు. కళాశాల విద్యార్ధినుల వసతి గహం ఉంది కాబట్టి పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాల్సిన ఆవశ్యకతను విద్యార్థులు వారికి వివరించారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి రుచి చూశారు. విద్యార్ధినుల సమస్యలను జెసి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇక కొంకాపల్లి బాలుర వసతి గృహం పాత భవనం కావడంతో పైనుంచి పెచ్చులు ఊడి పడిపోతున్నాయని విద్యార్థులు హాస్టల్‌ సిబ్బంది వారికి చూపించారు. నాడు నేడు పథకంలో వసతి గృహ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోరకు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను వారూ పరిశీలించి కోడి గుడ్లు సైజ్‌ తక్కువగా ఉండడాన్ని గుర్తించారు.