ప్రజాశక్తి-మండపేట
మండలంలోని ద్వార పూడి- తాపేశ్వరం రోడ్డు పనులు నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే నని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి అన్నారు.
ఆవారం మండల ంలోని తాపేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జెఎసిసమావేశంలో ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి ఆమె మాట్లాడుతూ అధ్వానంగా మారి ప్రమాదాలకు నెలవుగా ఉన్న తాపేశ్వరం-ద్వారపూడి రోడ్డు పూర్తి చేసేవరకూ పోరాటం తప్పదన్నారు. రోడ్డు పనులు సగంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వం వాహనదారుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ రోడ్డు పై రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు, వాహనదారులు రోడ్డుకు రెండువైపులా వున్న గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నప్పటికి అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. సోమవారం స్థానిక పెద్దకాలువ వంతెన నుంచి ఇప్పనపాడు వరకు బిక్షాటన కార్యక్రమం, బుధవారం తాపేశ్వరంలో ధర్నా తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జెఎసి సమావేశం తీర్మానించింది. సమావేశంలో జనసేన నాయకులు లీలా కృష్ణ, పలు సంఘాల, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.










