ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులకు ధృవపత్రాలు అందజేశారు.
కపిలేశ్వరపురం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. గురువారం వాకతిప్పలో గ్రామ సర్పంచ్ కొరిపెల్ల వెంకట నాగ స్రవంతి అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌సి తోట, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ, వివాహ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్, రేషన్ కార్డులు, భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ వంటి 11 రకాల సేవలను సచివాలయంలో నే ఉచితంగా అందిస్తారన్నారు. అనంతరం పలు రకాల మంజూరు పత్రాలను ఎంఎల్‌సి తోట చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ, ఎంపిపి మేడిశెట్టి సత్యవేణ, ఎంపిడిఒ ఎం.రామకష్ణారెడ్డి, తహశీల్దార్ కె.సూర్యారావు, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి జగనన్న సురక్ష పథకం ద్వారా పలు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ కాకుండా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కరిస్తారని తహశీల్దార్ నాగలక్ష్మి పేర్కొన్నారు. నేదునూరు గ్రామంలో సర్పంచ్ గుమ్మడి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష పథకం గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. గ్రామ సభలో ప్రజలు పలు సమస్యలను ఆమె దష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి జె.కల్యాణ్ చక్రవర్తి, ఇఒపిఆర్‌డి మోహన్‌కష్ణ, ఎంపిటిసి సభ్యులు యన్.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.
బేడ బుడగ జంగాలకు ఎస్‌సి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి
ఉప్పలగుప్తం బేడ బుడగ జంగాల కులస్తులకు ఎస్సి కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పేర్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం భీమనపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో సర్పంచ్ పెయ్యల రాజ్ కుమార్,ఎంపిడిఒ, కెఎస్ గౌరీ కుమారికి వినతిపత్రం అందజేశారు










