Jul 05,2023 23:21

ప్రజాశక్తి-ఆలమూరు
సిఎం జగన్‌ పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొత్తపేట ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. చింతలూరులో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులతో కలసి గడప..గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ముందుగా గ్రామంలో పర్యటిస్తూ ప్రభుత్వ పరంగా అందుతున్న అభివద్ధి పథకాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల ఆర్థిక పురోభివద్ది సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, వైసిపి మండల కన్వీనర్‌, సర్పంచ్‌ తమ్మన శ్రీనివాస్‌, మరో మండల కన్వీనర్‌ నామాల శ్రీనివాస్‌, సొసైటీ ఛైర్మన్లు నెక్కంటి బుజ్జి, మోటుపల్లి వెంకన్న, గ్రామ సర్పంచ్‌ మార్గాని కరుణ ఏసు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్‌ బుధవారం సవరప్పాలెం గ్రామంలో నిర్వహించిన గడప..గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు పందిరి శ్రీహరి రామ్‌ గోపాల్‌, మండల పార్టీ అధ్యక్షుడు బొంతు గోవింద శెట్టి, డెల్టా ఛైర్మన్‌ కుడుపూడి బాబు, మండల కో ఆప్షన్‌ సభ్యుడు మొసలి స్పర్జన్‌ రాజు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు,సవరపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.