Jul 07,2023 23:13

ప్రజాశక్తి-రామచంద్రపురం
పేద విద్యార్థుల చదువులకు,మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివద్ధి చేయడంతో పాటు అమ్మఒడి తో విద్యార్థులకు భరోసా కల్పిస్తూ సిఎం జగన్‌ పేదల్లో వెలుగులు నింపారని తెలిపారు. శుక్రవారం కె.గంగవరం మండలం దంగేరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల్లో అమ్మఒడి లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికంతో తమ పిల్లలను బడికి పంపలేని స్థితిలో ఉన్న ఆయా వర్గాలకు అమ్మఒడి దోహదప డుతుందన్నారు. పేద కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలి పనులకు పంపడం, ఈ విధానాన్ని అరికట్టాలని ఉద్దేశంతో సిఎం జగన్‌ అమ్మఒడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాకు రూ.15 వేల రూపాయలు నేరుగా జమవుతుందన్నారు. వీటిలో రూ.13 వేలు చదువులకు వెచ్చించటం జరుగుతుందని, రూ.2వేలు పాఠశాలల్లోని మరుగుదొడ్ల అభివద్ధికి వినియోగిస్తారన్నారు. అమ్మఒడి పథకం తో రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు అధికమయ్యాయి అని మంత్రి తెలిపారు. కె.గంగవరం మండలాలనికి గాను 5149 మంది తల్లులకు అమ్మబడి ప్రయోజనం చేకూరుతుందన్నారు. అమ్మ ఒడిప్రారంభమై, 4 సంవత్సరం గంగవరం మండలం లో 5149 విద్యార్థులకు రూ.7కోట్ల,72లక్షల35వేలు జమ అయ్యిందన్నారు. పథకం ప్రారంభమైన నాటి నుండి నాలుగు సంవత్సరాల్లో 20,419 మంది విద్యార్థులకు రూ.30కోట్ల62లక్షల85వేలు వారి వారి తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పంపన నాగమణి, సర్పంచి కొప్పిశెట్టి వెంకటరమణ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పండుల గోవిందరాజు, జెడ్‌పిటిసి సభ్యురాలు వరలక్ష్మి, ఎంపిటిసి సభ్యుడు కొప్పిశెట్టి లక్ష్మణ్‌, డిసిఎం డైరెక్టర్‌ పెట్టా శ్రీనివాస్‌, ఎంఇఒలు నాగరాజు ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మానందం, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.