ప్రజాశక్తి రామచంద్రపురం
రిజిస్ట్రేషన్ అన్ని పాత పద్ధతిలో స్టాంపులు ద్వారా కొనసాగించాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈమేరకు రామచంద్రపురం దస్తావేజు లేఖర్ల సంఘం పెన్ డౌన్ కార్యక్రమాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఖర్ల వ్యవస్థ బ్రిటీష్ కాలం నుంచి 1906లో ఏర్పటు చేశారని, నేటి వరకుకొనసాగుతుందన్నారు. ప్రభుత్వం నూతనం గా ప్రవేశపెట్టిన ప్రైమ్ 2.0 వల్ల దస్తావేజు లేఖర్ల వ్యవస్థ,ను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 296 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో 30 వేల మంది లేఖర్లు, సహాయకులు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు ఉన్నారన్నారు. వీరంతా రోడ్డును పడే అవకాశం ఉందన్నారు. ప్రైమ్ 2.0 వ్యవస్థ వల్ల పూర్వం బ్రిటిష్ కాలం నాటి దస్తావేజు పోయి తెల్ల కాగితంపై దస్తావేజులు వచ్చాయ అన్నారు. ప్రైమ్ 2.0 వ్యవస్థ వల్ల భూమిని అమ్ముకునే రైతుకు భూమిని కొనుక్కునే రైతుకు ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డులకు ఒటిపిలు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు ఉన్నాయి. చిన్నరైతులకు పల్లెటూరులో ఇటువంటి నిబంధన వల్ల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయి, వారికి మరింత కష్టాలు పెట్టే వ్యవస్థగా మారిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రైమ్ 2.0 వ్యవస్థను రద్దు చేయాలని, యధావిధిగా పాత పద్ధతిలోనే స్టాంపులు ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ రెండు రోజులు రాష్ట్ర లోని దస్తావేజు లేఖర్లు పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపామన్నారు. కార్యక్రమంలో రామచంద్రపురం దస్తావేజు లేఖర్లు, వెదుళ్ళ విజయభాస్కర్, మల్లిడి సాయిబాబారెడ్డి, సత్తి గంగిరెడ్డి, రఘురాం, గిరిజాలవెంకటేశ్వరరావు, పొక్కులురి వెంకటేశ్వరరావు, అడపా రాంబాబు, తాడి వీర గోపాల్ రెడ్డి, చందు, ఆదిత్య, తాడి జయభారతరెడ్డి తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.










