Sep 16,2023 11:51

ప్రజాశక్తి-మండపేట : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ విద్యార్థులతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. కాలుష్యం కారణంగా మానవకోటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఓజోన్ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలన్నారు.