Sep 12,2023 23:28

ప్రజాశక్తి-ఆలమూరు
చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సిజిఎఫ్‌. మాచింగ్‌ నిధులు రూ.1కోటి 60 లక్షలు మంజూరు కావడం శుభపరిణామమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ, ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అలాగే మంగళవారం ఆలయ అభివృద్ధికి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏటా జరిగే జాతర, తీర్ధ మహోత్సావాల్లో అమ్మవారిని యాత్రికులు సుమారు అయిదు లక్షల మంది దర్శించుకుంటారని అన్నారు. ఆలయం నందు ప్రాకార మండపం, ముఖమండపం పునర్నిర్మాణానికి రూ.1కోటి సిజిఎఫ్‌ నిధులు, రూ.60లకలు దేవస్థానం నిధులు విడుదల చేయించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇఒ వీర్రాజు చౌదరి, ఎజిపి నామాల శ్రీనివాస్‌, ఆలయ ఛైర్మన్‌ నూకపెయ్యి సూరిబాబు, జూనియర్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌ శ్రీనివాస్‌, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.