ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్
నియోజక వర్గ స్థాయి సమీక్ష ద్వారా సమస్యల పరిష్కారానికి, ప్రజల ఆకాంక్ష మేరకే ఫలితాలు ప్రతిబింభించడం సాధ్యం అవుతుందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు, సినీమాటోగ్రాఫ్ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కష్ణ, మోమ్ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం కొవ్వూరు నియోజక వర్గ స్థాయి సమీక్ష సమావేశం స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా, డివిజన్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ప్రాధాన్యత భవనాలు, విద్య, హౌసింగ్, ఎన్‌పిఐ, టిడ్కో, వ్యవసాయ, హార్టికల్చర్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యుఎస్, పౌర సరఫరాలకు చెందిన 11 అంశాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్.శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ పరిపాలన సంస్కరణల్లో భాగంగా పాలనా వికేంద్రీకరణ వ్యవస్థను ఏర్పాటు గ్రామాల్లోనికే తీసుకు వెళ్లేందుకు సచివాలయ వ్యవస్థ తీసుకు వచ్చామన్నారు. ఆ ప్రక్రియను మరింత ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో రైతుకు భరోసా కల్పించేందుకు ఆర్బీకే లు, ప్రజారోగ్య పరిరక్షణకు వై ఎస్ ఆర్ హెల్త్ సెంటర్స్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. హోమ్ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రాధాన్యత భవనాలు, ఇతర పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పూర్తి చేసిన భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివద్ధికి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆమేరకు పరిపాలన పరమైన ఆమోదం ఇచ్చామన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కింద గుర్తించిన పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు. విద్యుత్ శాఖధికారులు నియోజకవర్గంలో పూర్తయినా జగనన్న కాలానీల్లో అన్ని గహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచడం జరిగిందని, అసుపత్రిలో మరిన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తాన్నారు. ఈ కార్యక్రమంలో జె.సి. తేజ్ భరత్, మున్సిపల్, ఎఎస్‌పి రజని, ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు, చైర్ పర్సన్ బావన రత్నకుమారి, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, మాజీ ఎంఎల్‌సి కోడూరి శివ రామక ష్ణ పాల్గొన్నారు.










