ప్రజాశక్తి-రామచంద్రపురం తమకు పరిశుభ్రమైన రక్షిత మంచినీరు అందించాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణను నెలపర్తిపాడు గ్రామ ప్రజలు అభ్యర్థించారు. సోమవారం మంత్రి వేణు గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా. తాగునీటి సమస్యను తాగునీటి సమస్యను, అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యను, డ్రైనేజీ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రికి వివరించారు. గ్రామంలో చాలామంది ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం ద్వారా వాళ్లకి ఇల్లు కట్టించాలని, కొంతమందికి వద్ధులకు పెన్షన్లు రాలేదని తెలిపారు. బాపనయ్య చెరువు గ్రామంలో ప్రధానమైన రోడ్డు వెడల్పు చేయాలని గ్రామస్తులు మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. విద్యారంగంలో మనబడి- నాడు నేడు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన తదితర పథకాలు అమలవుతునాయి అని వివరించారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్టును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబటి భవాని తహశీల్దార్, తేజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










