- రైతు వద్ద 10 కేజీలు రూ.1390
ప్రజాశక్తి - ఆలమూరు : పచ్చిమిర్చి ధరకు అమాంతంగా రెక్కలొచ్చాయి. అసలే ఎండాకాలం రోజు రోజుకి వేసవి తాపంతో పంటల దిగుబడులు ఘననీయంగా పడిపోవడంతో దీని ధర పైపైకి పెరిగుతూ పోతుంది. వివరాలు లోనికి వెళితే మండలంలోని మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్లో శనివారం మధ్యాహ్నం ఒక రైతు వద్ద 10 కేజీలు ధర రూ. 1390 పలకడంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. రికార్డు స్థాయిలో ఇంత ధర పలకడం ఇదే ప్రధమమని మార్కెట్ నిర్వాహకులు పాలూరి సత్తిబాబు, చెల్లబోయిన సింహాచలం, అందే బుజ్జి, వెంకట రామారావు(అబ్బు), దొండపాటి సుబ్బరాజు, వీరబాబులతో పాటుగా రైతులు పేర్కొంటున్నారు. రైతు వద్దనే ఇంత ధర పలుకుతుంటే ఇక రిటైల్ వ్యాపారుల అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు.










