Jul 29,2023 15:03
  • మత్స్యకారులకు ఉచిత బియ్యం పంపిణీకి ఏర్పాటు
  • కుమ్మరి సావరం వద్ద ఏటిగట్టు రక్షణ పనుల్లో మంత్రి వేణు

ప్రజాశక్తి-రామచంద్రపురం : గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి ఏటా వరదలు సంభవించటం పరిపాటని వరద ప్రాంతాల్లోని ప్రజలు ఏ విధమైన భయాందోళనకు గురికా వద్దని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆయన శనివారం కోటిపల్లి సుందరపల్లి మధ్య గల కుమ్మరి సవరం వద్ద బలహీన ఏటి గట్టు పరిశీలించి అక్కడ జరుగుతున్న రక్షణ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి సహాయ చర్యల కోసం రూ 10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లే పరిస్థితిలేనందున వారికి ఉచిత బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడానని అన్నారు. వరధ నీరు పెరిగి గ్రామాల్లోకి ప్రవేశిస్తే అక్కడ ప్రజలకు అవసరమైన భోజన ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించినట్లు ఆయన వివరించారు. రావులపాలెం నుండి యానం వరకు గల గోదావరి ఏటిగట్టు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి పంపించినట్లు ఆయన వివరించారు. గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో ఎవరు నది వద్దకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.