- అమ్మ ఒడి సభలో మంత్రి వేణు
ప్రజాశక్తి-రామచంద్రపురం : పేద విద్యార్థుల చదువులకు,మౌలిక సదుపాయాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు అమ్మఒడితో విద్యార్థులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల్లో వెలుగులు నింపారని తెలిపారు. శుక్రవారం కే గంగవరం మండలం దంగేరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అమ్మఒడి లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికంతో తమ పిల్లలను బడికి పంపలేని స్థితిలో ఉన్న ఆయా వర్గాలకు అమ్మవడి ఎంతో దోహదపడుతుందన్నారు. పేద కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలి పనులకు పంపడం, ఈ విధానాన్ని అరికట్టాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి అమ్మవడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు.
అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాకు 15 వేల రూపాయలు నేరుగా జమవుతుందన్నారు. వీటిలో 13 వేల రూపాయలు చదువులకు వెచ్చించటం జరుగుతుందని, రెండు వేల రూపాయలు పాఠశాలల్లోని మరుగుదొడ్ల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు.
అమ్మఒడి పథకంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు అధికమయ్యాయి అని మంత్రి తెలిపారు. కే గంగవరం మండలాలనికి గాను 5149 మంది తల్లులకు అమ్మబడి ప్రయోజనం చేకూరుతుందన్నారు. వీరి ఖాతాలకు 15 వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అమ్మ ఒడిప్రారంభమై, 4 సంవత్సరం గంగవరం మండలంలో 5149 విద్యార్థులకు రూ.7 కోట్ల ,72 లక్షల,35, వేల రూపాయలు జమ చేయబడిందని మంత్రి తెలిపారు. పథకం ప్రారంభమైన నాటి నుండి నాలుగు సంవత్సరాలలో 20, 419 మంది విద్యార్థులకు 30 కోట్ల 62 లక్షల 85 వేల రూపాయలు వారి వారి తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పంపన నాగమణి, సర్పంచి కోప్పిశెట్టి వెంకటరమణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పండుల గోవిందరాజు, జడ్పిటిసి వరలక్ష్మి ఎంపీటీసీ కోప్పిశెట్టి లక్ష్మణ్ డిసిఎం డైరెక్టర్ పెట్ట శ్రీనివాస్ ఎంఈఓ లు నాగరాజు ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మానందం, పిల్లల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










