ప్రజాశక్తి-మండపేట
స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల నిరాహార దీక్షల్లో భాగంగా ధర్నా చేపట్టమన్నారు. ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పని ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎం జగన్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అధ్యక్షుడు బి.కొం డా, ప్రధాన కార్యదర్శి కె.నరేంద్ర, లోవరాజు, విజ రు, రాజు, భాను, హేమ లత కార్మికులు పాల్గొన్నారు.










