Jul 31,2023 00:04


ప్రజాశక్తి - యంత్రాంగం
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో లంకగ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. పలుచోట్ల కాజ్‌వేలపైకి నీరుచేరింది. వరద నేపథ్యంలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పునరావాసకేంద్రాలు ఏర్పాటుచేశారు.
అమలాపురం :
గంట గంటకి పెరుతున్న వరద నీటితె లంక గ్రామాల ప్రజల ఆందోళన చెందుతున్నారు. వశిష్ట, వైనతేయ గౌతమి, వద్ద గౌతమి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. ఆ కాజ్‌ వేలు నీట మునిగి లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ధవళేశ్వరం వద్ద 15 అడుగుల నీటిమట్టం నమోదవడంతో పాటు పెరుగుతున్న వరదనీరుతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కోనసీమ వాసులకు ఆందోళనలో ఉన్నారు. ఆదివారం 13,53,174 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు.గోదావరి వరద ఉధృతి మూలంగా జిల్లాలో 8 మండలాలలోని 19 గ్రామాలు, 24 ఆవాసాలలో 749 కుటుంబాలలోని 2,210 మంది వరద ప్రభావానికి నిరాశ్రయులు అయ్యా రని అధికారులు తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు ఆదివారం అయినవిల్లి మండలంలో నీట మునిగిన లంక గ్రామాలను పర్యటించారు.
జిల్లా వ్యాప్తంగా 542 హెక్టార్లలో వరి 378 హెక్టార్లలో ఉద్యాన పంటలు వరద నీటి మునిగాయి. అయినవిల్లి అల్లవరం, మామిడి కుదురు, ముమ్మిడివరం, రాజోలు కె గంగవరం, సఖినేటిపల్లి , పి గన్నవరం మండలాలలోని వరద ప్రభావిత గ్రామాలలో ఉన్న సుమారు 30 పాఠశాలలకు ఈనెల 31వ తేదీ సోమవారం సెలవుగా ప్రకటించడం జరిగింది.
పునరావాస కేంద్రాల ఏర్పాటు
కోనసీమ జిల్లాలో 71 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ముందుగా వరద ప్రభావానికి నిరాశ్రయులైన వారి కొరకు 19 పునరావాస కేంద్రాలను ప్రారంభించి సుమారుగా 3,900, ఆహార ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగిందనీ అధికారులు తెలిపారు. వరదతో నీట మునిగిన న లంక గ్రామాల ప్రజల స్థానిక స్మశాన వాటికలు కూడా నీడ మునగడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్‌ వే సమీపంలో ఉన్న తోగరుపాయ శ్మశాన వాటిక నీట మునిగింది.
ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
రాజోలు : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి.శనివారం కంటే ఆదివారం వశిష్ఠ గోదావరి మరింత పోటెత్తింది. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కూరగాయలు, అరటి తదితర తోటలు నీట మునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గ్రామాల వారీగా తహసీల్దారు స్థాయి అధికారులను నియమించి పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు, ఎంఎల్‌ఎలు వరద గ్రామాల్లో పర్యటించారు. .
వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్‌
అయినవిల్లి : అయినవిల్లి లంక గ్రామం మరియు కాజ్వే, వీరవల్లి పాలెం గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మరియు ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు తో కలిసి వరద సహాయక చర్యలను గ్రామాల్లో పర్యటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో..
మామిడికుదురు : భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ సోమవారం వరకు కోనసీమలో వరద తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. పెదపట్నంలంక, బి.దొడ్డవరం, అప్పనపల్లి పూర్తిగా వరదనీటిలో చిక్కుకొన్నాయి. ఈ మూడు గ్రామాల్లో కలెక్టర్‌ ఆదేశాల మేరకు రైతు బజార్లు ఏర్పాటు చేయ డంతో కూరగాయాలుకొనుగోలుకై కొంత ఉపశమనం లభించి ంది. వరదనీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పనపల్లి బాల బాలాజీ ఆలయ ఆవరణలో వరద నీరు చేరింది. వరద తగ్గే వర కూదర్శనం నిలిపివేసినట్లు సహాయకమిషనర్‌ జి.మాధవి తెలిపారు.
వరద బాధితులను ఆదుకునేందుకు..
ఐ.పోలవరం : వరద ముంపు ప్రాంతవాసులను ఆదుకొనేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అమలాపురం ఆర్‌డిఒ సంత రాయుడు అన్నారు.ఆదివారం వరద ప్రాంతాల్లో పర్యటించారు .మురమళ్ళ రాఘవేంద్ర వారధి వద్ద ఉన్న పుష్కరాల రేవు వద్ద నివాసం ఉంటున్న పది కుటుంబాలవారికి ఇళ్లలోనికి వరద నీరు రావటంతో ఎవ్వరూ మమ్ములను పట్టించు కోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు . ఐ పోలవరం తహశీల్దార్‌ ఝూన్సీలక్ష్మీ కుమారిని వివరణ అడగగా వరద బాధితులకు పునరావ సం కేంద్రం ఏర్పాటు చేయటం జరిగిందని, వైద్య బందం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
కోటిపల్లి వద్ద పెరుగుతున్న వరద
రామచంద్రపురం : వరద ఉధృతి కొనసాగుతుండగా ఆదివారం సాయంత్రం మళ్లీ కోటిపల్లి వద్ద రెండు అడుగుల మేర వరద నీటి ప్రవాహం పెరిగింది. దీనితో ఇక్కడ మత్స్యకార కాలనీ వాసులకు పునరావస కేంద్రం ఏర్పాటు చేశారు. కోటిపల్లి లోని జిల్లా పరిషత్‌ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఇక్కడ గల పైడా వారి అన్న సత్రంలో భోజన ఏర్పాట్లు చేశారు. ఉచిత భోజనాలను గ్రామ సర్పంచ్‌ పెమ్మాడి బేబీ సత్తిబాబు, వైసిపి నాయకులు రేవు శ్రీను ప్రారంభించారు.
కపిలేశ్వరపురం : గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో మండలంలోని ముంపునకు గురైన లంక గ్రామాల్లో ఆదివారం అధికారులు పర్యటించారు. అద్దంకి వారి లంక, పల్లపులంక, కేదార్లంక, వీధి వారిలంక నారాయణలంక గ్రామాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను తహశీల్దార్‌ కె.సూర్యారావు, ఎంపిడిఒ ఎం.రామకష్ణారెడ్డి వైద్యాధికారులు పరిశీలించారు.