Jul 27,2023 00:17

ప్రజాశక్తి-యంత్రాంగం
మణిపూర్‌లో అమానుషఘటనలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. మణిపూర్‌ దమనకాండపై డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోన సీమ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఐ.పోలవరం మణిపూర్‌ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ప్రధానమంత్రి మోడీ పూనుకోవాలని, హింసను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి గుదే దుర్గా ప్రసాద్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో అల్లర్లకు పాల్పడే అరచకశక్తులపై కఠిన చర్యలు తీసుకుని ,మాణిపూర్‌ లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ ఝూన్సీ లక్ష్మి కుమారి వినతిపత్రాని అందజేశారు. కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి టి.నాగలక్ష్మి, నిమ్మకాయల వెంకటేష్‌, తోట గంగారత్నం, కె.నాగలక్ష్మి, జి.గంగాభవాని, ఎవి.రత్నం, పి.అనంతలక్ష్మి, పి.నాగమణి, గోవింద్‌ రాజ్‌, ముమ్మిడివరపు సుబ్బారావు పాల్గొన్నారు.మండపేట మణిపూర్‌ లో జరుగుతున్న అల్లర్లకు, అత్యాచారాలకు నిరసనగా యుటిఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ, నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ కె. గోపాలకష్ణారెడ్డి మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తక్షణం అరికట్టి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి డివి రాఘవులు మాట్లాడుతూ తక్షణం దాడులను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ చల్లా రవికుమార్‌ మాట్లాడుతూ తెగల మధ్య జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం అరికట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు పి. సురేంద్ర కుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో మారణకాండకు పాల్పడిన వారిని తక్షణం అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ బేతినిడి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శులు, రాయుడు శ్రీనివాస్‌, గొల్లపల్లి రాజు మండపేట పట్టణ శాఖ అధ్యక్షులు పి. రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ వైవి రమణ, కపిలేశ్వరపురం అధ్యక్షులు శ్రీనివాస్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఉప్పలగుప్తం మణిపూర్‌ ప్రజలకు మహిళలకు రక్షణ కల్పించాలని హింసకు పాల్పడిన మతోన్మాదులను దోషులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు నాయకులు డిమాండ్‌ చేశారు.మాల మహానాడు మండల కన్వీనర్‌ కొంకి వెంకటబాబ్జి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో అమలాపురం రూరల్‌ సిఐ వీరబాబు, ఎస్‌ఐ జి.వెంకటేశ్వర రావులకు వారు వినతి పత్రం అందజేశారు వినతి పత్రం అందజేసిన వారిలో ఎంపిటిసి సభ్యుడు కొంకి ఏడుకొండలు, మాల మహానాడు నాయకులు పెయ్యల కొండబాబు, కొంకి బాలకృష్ణ, భగవాన్‌ దాస్‌, కిరణ్‌ కుమార్‌,మొసలి శ్రీనుసాధనాల సురేంద్ర తదితరులున్నారు.